Rajesh: కన్నడ సినీ రంగంలో మరో విషాదం.. కళాతపస్వి రాజేశ్ మృతి

  • వయసు సంబంధిత సమస్యలతో రాజేశ్ మృతి
  • రాత్రి 2.30 గంటల సమయంలో తుదిశ్వాస
  • ఈ సాయంత్రం జరగనున్న అంత్యక్రియలు
Kannada senior actor Rajesh passes away

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి గురించి ఇంకా మర్చిపోకముందే... అక్కడ మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు రాజేశ్ కన్ను మూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. వయసు సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆయన పరిస్థితి మరింత క్షీణించింది. డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనను బతికించలేకపోయారు.

రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని బెంగళూరులోని విద్యారణ్యపురలోని నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఈ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

More Telugu News