Srisailam: శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం

  • మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు
  • ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు ఉత్సవాలు
  • సీఎం జగన్ ను ఆహ్వానించిన మంత్రి వెల్లంపల్లి, ఆలయ ఈవో
  • సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేత
Invitation for CM Jagan to attend Srisailam Brahmotsavas

మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ వేడుకలకు శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని రమణీయంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ఏపీ సీఎం జగన్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆలయ ఈవో లవన్న ఆహ్వానించారు.

మంత్రి వెల్లంపల్లి, ఆలయ ఈవో లవన్న నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించారు. ఆలయ వర్గాలు సీఎం జగన్ కు జ్ఞాపికను కూడా బహూకరించాయి.

More Telugu News