Pavan kalyan: భారీ రిలీజ్ విషయంలో తగ్గని 'భీమ్లా నాయక్'

  • 'భీమ్లా నాయక్' గా పవన్ కల్యాణ్
  • మరో పవర్ఫుల్ పాత్రలో రానా
  • తమన్ పాటలకు మంచి రెస్పాన్స్
  • ఈ నెల 25వ తేదీన విడుదల  
Bheemla Nayak movie update

పవన్ కల్యాణ్ నుంచి ఈ నెల 25వ తేదీన 'భీమ్లా నాయక్' రావడం ఖాయమైపోయింది. దాంతో ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టడానికి తగిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. పవన్ క్రేజ్ కి తగిన విధంగానే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక యూఎస్ లో ఈ సినిమాను 400 పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన నుంచి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక పవన్ పాత్రతో సమానమైన పాత్రను రానా చేయడంతో, ఆ వైపు నుంచి కూడా ఆసక్తి నెలకొంది.

త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ సరసన నిత్యామీనన్ అలరించనుండగా, రానా జోడీగా సంయుక్త మీనన్ ఆకట్టుకోనుంది. ఇక ముఖ్యమైన పాత్రలలో సముద్రఖని .. బ్రహ్మానందం .. మురళీశర్మ కనిపించనున్నారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

More Telugu News