Deep Sidhu: హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతి

  • సోనేపట్ వద్ద దుర్ఘటన 
  • కుండ్లీ-మనేసర్ రహదారిపై ప్రమాదం
  • దీప్ సిద్ధూ మృతిని నిర్ధారించిన పోలీసులు
  • గతేడాది రైతుల ర్యాలీ సందర్భంగా వినిపించిన దీప్ సిద్ధూ పేరు
Punjabi actor Deep Sidhu died in a road accident

హర్యానాలోని సోనేపట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబీ నటుడు దీప్ సిద్ధూ దుర్మరణం చెందాడు. కుండ్లీ-మనేసర్ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించింది దీప్ సిద్ధూయేనని పోలీసులు గుర్తించారు.

దీప్ సిద్ధూ సామాజిక కార్యకర్తగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది రైతులు రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో దీప్ సిద్ధూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొన్ని అల్లర్లు జరగడంతో, దీప్ సిద్ధూపై అనుమానాలు తలెత్తాయి. అతడు కోవర్టు అంటూ ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం అతడిపై కేసు నమోదు చేసింది. కాగా దీప్ సిద్ధూ మృతితో అతడి అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

More Telugu News