Kalaavathi: సర్కారు వారి పాట నుంచి 'కళావతి' సాంగ్ విడుదల

  • అభిమానులకు వాలంటైన్స్ డే కానుక
  • పాటను సోషల్ మీడియాలో పంచుకున్న మహేశ్
  • తమన్ సర్వకల్పనలో కళావతి
  • సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్
Kalaavathi song released from Sarkaru Vaari Paata

మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. తాజాగా ఈ చిత్రం నుంచి 'కళావతి' అనే పాట విడుదలైంది. వాస్తవానికి ఈ పాట విడదులకు ముందు లీక్ కావడంతో చిత్రబృందం తీవ్ర నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలో తాజా పాటను ఒరిజినల్ ఆడియోతో చిత్రబృందం రిలీజ్ చేసింది. 'మాంగల్యం తంతునా నేనా' అంటూ సాగే ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ హృద్యంగా ఆలపించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చారు. విశేషం ఏమిటంటే ఈ పాటకు తమన్ కళావతి రాగంలో బాణీలు కట్టారు.

కాగా, ఈ పాటను సోషల్ మీడియాలో పంచుకున్న మహేశ్ బాబు... తన ఫేవరెట్ సాంగ్స్ లో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. సర్కారు వారి పాట చిత్రం మే 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

More Telugu News