Ambati Rambabu: జీవీఎల్ ఎందుకు హడావుడి పడ్డారు? కేంద్ర కమిటీ అజెండా ఎందుకు మారింది?: అంబటి రాంబాబు

  • అజెండాలో ప్రత్యేకహోదా అంశంపై జీవీఎల్ ఎందుకు హడావుడి పడ్డారు?
  • ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు స్వాగతించలేకపోయారు?
  • జీవీఎల్ వ్యాఖ్యలపై చర్చ జరగాలి
Ambati Rambabu response on GVL Narasimharao comments on AP special status

ఏపీ ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. విభజన చట్టం పెండింగ్ అంశాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అజెండాలో తొలుత ప్రత్యేక హోదాను కూడా కేంద్రం చేర్చింది. వెంటనే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు దీనిపై స్పందిస్తూ, ఈ కమిటీకి ప్రత్యేకహోదాతో సంబంధం లేదని చెప్పారు. ఏపీ ప్రత్యేకహోదా గురించి తెలంగాణ రాష్ట్రంతో చర్చించాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ తర్వాత అజెండా నుంచి ప్రత్యేకహోదాను కేంద్ర హోంశాఖ తొలగించింది. ఈ పరిణామాలు వైసీపీ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ కమిటీ అజెండా ఎందుకు మారిందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఏపీకి అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని అజెండాలో పెడితే జీవీఎల్ ఎందుకు అంత హడావుడి చేశారని అన్నారు. దీనికి జీవీఎల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అజెండాలో ప్రత్యేక హోదా ఉంటే జీవీఎల్ ఎందుకు స్వాగతించలేకపోయారని ప్రశ్నించారు. జీవీఎల్ వ్యాఖ్యలపై చర్చ జరగాలని అన్నారు.

More Telugu News