Prabhas: ప్రేమికుల దినోత్సవాన 'రాధేశ్యామ్' స్పెషల్ అప్ డేట్!

  • రొమాంటిక్ లవ్ స్టోరీగా 'రాధేశ్యామ్'
  • ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే
  • ఈ నెల 14వ తేదీన ఇంట్రెస్టింగ్ అప్ డేట్
  • మార్చి 11వ తేదీన సినిమా విడుదల  
Radhe Shyam movie update

ప్రభాస్ నుంచి చాలా గ్యాప్ తరువాత వస్తున్న సినిమా .. పాన్ ఇండియా స్థాయిలో తనని తాను రొమాంటిక్ హీరోగా ఆవిష్కరించుకునే సినిమా 'రాధే శ్యామ్'. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అనే విషయాన్ని టైటిల్ చెప్పేస్తోంది. అందుకు తగినట్టుగానే కొత్త లుక్ తో ఈ సినిమాలో ప్రభాస్ కనిపించనున్నాడు.

ఈ సినిమాను మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. దాంతో మళ్లీ ప్రమోషన్స్ కోసం ఈ సినిమా టీమ్ రంగంలోకి దిగిపోయింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమా నుంచి స్పెషల్ అప్ డేట్ రానున్నట్టు చెబుతున్నారు.

ప్రపంచ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్పెషల్ వీడియో వదులుతారా? ఏదైనా సాంగ్ రిలీజ్ చేస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. దాదాపు విదేశాల్లోనే నడిచే ఈ ప్రేమకథలో కృష్ణంరాజు .. భాగ్యశ్రీ .. జగపతిబాబు .. సత్యరాజ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 

More Telugu News