Rohit Sharma: టీమిండియా కెప్టెన్ గా తొలి సిరీస్ లోనే అరుదైన రికార్డును సాధించిన రోహిత్ శర్మ

  • వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా
  • విండీస్ పై సిరీస్ ను వైట్ వాష్ చేయడం ఇదే తొలిసారి
  • సొంత గడ్డపై ఇప్పటి వరకు 12 సిరీస్ లను వైట్ వాష్ చేసిన భారత్
Rohit Sharma achieves record in ODI series against West Indies

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో వెస్టిండీస్ ను వైట్ వాష్ చేసిన తొలి భారత కెప్టెన్ గా అవతరించాడు. తాను సారథ్యం వహించిన తొలి సిరీస్ లోనే ఈ ఘనతను సాధించడం గమనార్హం.

అంతేకాదు, విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక రికార్డును అధిగమించాడు. ఇప్పటి వరకు 13 వన్డేలకు సారథ్యం వహించిన రోహిత్... 11 మ్యాచుల్లో ఇండియాకు విజయాలను కట్టబెట్టాడు. కోహ్లీ 13 మ్యాచుల్లో 10 విజయాలను అందించాడు. మరోవైపు 13 మ్యాచుల్లో 12 విజయాలతో ఇంజమమ్ ఉల్ హక్ (పాకిస్థాన్), క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్) తొలి స్థానంలో ఉన్నారు.

వన్డే సిరీస్ లో విండీస్ ను భారత్ వైట్ వాష్ చేయడం ఇదే తొలిసారి. స్వదేశంలో ఇప్పటి వరకు శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఇంగ్లండ్ జట్లను భారత్ వైట్ వాష్ చేసింది. ఇప్పుడు ఆ జాబితాలో విండీస్ కూడా చేరింది. సొంత గడ్డపై ఇప్పటి వరకు 12 సిరీస్ లను టీమిండియా వైట్ వాష్ చేసింది. 2014లో చివరి సారిగా శ్రీలంకతో జరిగిన ఐదు వన్టేల సిరీస్ ను 5-0తో ఇండియా వైట్ వాష్ చేసింది. ఆ తర్వాత ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మరో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

More Telugu News