Varun Tej: 'గని' .. ఇక పోరాటానికి సిద్ధం!

  • వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'గని'
  • బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ
  • సయీ మంజ్రేకర్ తొలిపరిచయం
  • త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన  
Ghani movie update

బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ 'గని' సినిమా చేశాడు. ఈ సినిమాలో ఆయన బాక్సర్ గా కనిపించనున్నాడు. పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం .. అనిపించడం కోసం ఆయన విదేశాల్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని మరీ రంగంలోకి దిగాడు. కరోనా కారణంగా అనుకున్నదానికంటే ఆలస్యంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.

అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో, తెలుగు తెరకి కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయమవుతోంది.

ఈ సినిమాలో జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర కీలకమైన పాత్రలను పోషించారు. ఇక నదియా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. డిసెంబర్ లోనే విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖాయం చేయనున్నారు..

More Telugu News