Rohit Sharma: రోహిత్ ముందు మూడు రికార్డులు.. ఏ కెప్టెన్ కూ సాధ్యం కాని ఘనతను సాధించే దిశగా హిట్ మ్యాన్!​

  • వెస్టిండీస్ పై క్లీన్ స్వీప్ చేసే అవకాశం
  • అదే జరిగితే తొలి భారత కెప్టెన్ గా రికార్డు
  • ఒక సిక్సర్ బాదితే ధోనీని దాటేసే అవకాశం
  • ఐదు సిక్సర్లు కొడితే 250 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర
Rohit Has 3 Records In His Front To Break

టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త రికార్డులను రాసేందుకు సిద్ధమవుతున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ ను ఇప్పటికే 2–0తో కైవసం చేసుకున్న టీమిండియా.. ఇవాళ జరగబోయే మూడో వన్డేతో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఒకవేళ క్లీన్ స్వీప్ చేస్తే.. వెస్టిండీస్ పై సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించనున్నాడు. ఇప్పటిదాకా ఏ కెప్టెన్ కూ సాధ్యం కాని ఘనతను సాధించి చూపించినవాడవుతాడు.

క్లీన్ స్వీప్ తో భారత్ కు సిరీస్ అందించిన ఏడో కెప్టెన్ గానూ రోహిత్ నిలుస్తాడు. అంతకుముందు కపిల్ దేవ్, దిలీప్ వెంగ్ సర్కార్, అజారుద్దీన్, గౌతమ్ గంభీర్, ధోనీ, విరాట్ కోహ్లీల సరసన చేరుతాడు.

ఇక, మరో విషయంలో ధోనీని దాటేసే రికార్డుకూ రోహిత్ చేరువలో ఉన్నాడు. తొలి వన్డేలో అర్ధశతకంతో మెరిసిన అతడు.. ఓ సిక్సర్ బాదాడు. ఈ మ్యాచ్ లో మరో సిక్సర్ బాదితే వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ గా ధోనీని దాటేస్తాడు. ధోనీ 113 ఇన్నింగ్స్ లలో 116 సిక్సర్లు బాదితే.. రోహిత్ కేవలం 68 ఇన్నింగ్స్ లలోనే 116 సిక్సర్లు బాది ధోనీ రికార్డును ప్రస్తుతం సమం చేశాడు. ఈ మ్యాచ్ లో ఐదు సిక్సర్లు బాదితే 250 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్ గా చరిత్రకెక్కుతాడు.

More Telugu News