Vijay: విజయ్ జోడీగా రష్మికను సెట్ చేసిన వంశీ పైడిపల్లి!

  • తెలుగులో స్టార్ హీరోయిన్ గా రష్మిక
  • కన్నడలోను అదే క్రేజ్
  • హిందీలో కుదురుకునే ప్రయత్నాలు
  • కోలీవుడ్ పై కూడా దృష్టి
Rashmika in Vamshi Paidipally movie

అందం .. అభినయం .. అదృష్టం కలగలిసిన కథానాయికగా రష్మిక కనిపిస్తుంది. తెలుగు .. కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తున్న రష్మిక, తమిళ .. హిందీ భాషల్లోను కుదురుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది.

తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్, ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకున్నారని అంటున్నారు.

ఇక మరో కథానాయికకు కూడా ఛాన్స్ ఉందట. ఆ పాత్రకి పూజ హెగ్డేను తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆల్రెడీ విజయ్ తో పూజ 'బీస్ట్' సినిమా చేస్తోంది. అందువలన ఆమె ఈ ప్రాజెక్టులో ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

More Telugu News