COVID19: కొవాగ్జిన్ టీకా.. ఐసీఎంఆర్ కు రాయల్టీ చెల్లిస్తున్న భారత్ బయోటెక్

  • ఇప్పటిదాకా రూ.171.74 కోట్లు కట్టిందన్న కేంద్రం
  • వ్యాక్సిన్ కోసం ఐసీఎంఆర్ కు రూ.35 కోట్ల ఖర్చు
  • ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ కలిసి కొవాగ్జిన్ తయారీ
Bharat Biotech Paid Rs 171 crore As Royatly For ICMR Says Center

కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ పై భారత ఔషధ పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి భారత్ బయోటెక్ రాయల్టీ చెల్లిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి ఐసీఎంఆర్ కు సంస్థ రూ.171.74 కోట్ల రాయల్టీ చెల్లించిందని చెప్పింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయ మంత్రి భాతీ ప్రవీణ్ పవార్.. ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రకటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వకంగా బదులిచ్చారు.

కొవాగ్జిన్ పరిశోధన, అభివృద్ధి కోసం రూ.35 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు. ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ సంస్థ రాయల్టీ చెల్లించిందని, దాని ద్వారా ఐసీఎంఆర్ కు రూ.136.74 కోట్ల లాభం సమకూరిందని పేర్కొన్నారు.  వచ్చిన ఆ డబ్బును ఆరోగ్య పరిశోధనల కోసం వినియోగిస్తారని ఆమె తెలిపారు. భారత్ బయోటెక్ తో కలిసి ఐసీఎంఆర్ కరోనా వైరస్ తో కొవాగ్జిన్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో 2020 జనవరిలో వైరస్ ను ఐసోలేట్ చేశారు. దానిని ఇనాక్టివ్ చేసి టీకాను తయారు చేశారు.

More Telugu News