Cricket: వెస్టిండీస్ తో తొలి వన్డేలో కోహ్లీ ఔట్ పై సునీల్ గవాస్కర్ స్పందన

  • కోహ్లీ అంచనాలు తప్పాయి
  • బంతి కొంచెం ఎక్కువ బౌన్స్ అయింది
  • సౌతాఫ్రికా బౌలర్లు కూడా ఇదే ట్రై చేశారు
  • తర్వాతి మ్యాచ్ లకు ముందే సిద్ధమవ్వాలని సూచన
Kohli Must Be Prepared For Next Matches Sunny On Kohli Out

ఫుల్ టైం కెప్టెన్ గా రోహిత్ శర్మ సారథ్యంలో ఆడిన తొలి మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ అయితే కొట్టిందిగానీ.. విరాట్ కోహ్లీ అవుటైన తీరే అభిమానులను కాస్త నిరాశపరిచింది. అల్జారీ జోసెఫ్ విసిరిన బౌన్సర్ ను ఆడే క్రమంలో ఫైన్ లెగ్ బౌండరీ వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. దీనిపై టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు.

కోహ్లీకి సౌతాఫ్రికా బౌలర్లు సైతం ఇలాంటి బంతులే సంధించారని గుర్తు చేశాడు. ‘‘దక్షిణాఫ్రికాతో సిరీస్ లో వన్డేల్లో ఆ జట్టు బౌలర్లు ఇలాంటి బౌన్సర్లే కోహ్లీకి వేశారు. అలాంటి బంతులను కోహ్లీ అసలు వదిలేయడు. కంట్రోల్ లో ఉండని హుక్ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తాడు’’ అని గవాస్కర్ అన్నాడు.

వెస్టిండీస్ తో తొలి వన్డేలో మాత్రం హుక్ షాట్ ఆడడంలో కోహ్లీ ఫెయిల్ అయ్యాడని, అనుకున్నదానికన్నా బాల్ కొంచెం ఎక్కువే బౌన్స్ అయిందని, దీంతో కోహ్లీ అంచనాలు తప్పి బంతి ఎడ్జ్ తీసుకుందని గుర్తు చేశాడు. కాబట్టి తర్వాతి మ్యాచ్ లకు కోహ్లీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని, ఆ బంతులకు ముందే సిద్ధమవ్వాలని సూచించాడు.   

More Telugu News