Nagarjuna: 25 రోజులు పూర్తిచేసుకున్న 'బంగార్రాజు'

  • జనవరి 14న వచ్చిన 'బంగార్రాజు'
  • సంక్రాంతి విజేతగా నిలిచిన సినిమా
  • నేటితో 25 రోజులు పూర్తి 
  • ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పిన టీమ్    
Bangarraju Movie Update

నాగార్జున - నాగచైతన్య కథానాయకులుగా 'బంగార్రాజు' సినిమా రూపొందింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేశారు. పండుగ సందర్భానికి తగిన కథ కావడంతో ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభించింది.

తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి బరిలోకి దిగిన సినిమాల్లో విజేతగా నిలిచింది. ఈ రోజుతో ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆడియన్స్ కి థ్యాంక్స్ చెబుతూ ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

నాగార్జున కేవలం నాలుగు నెలల్లోనే ఈ సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడం విశేషం. అనూప్ రూబెన్స్ పాటలు ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. రమ్యకృష్ణ - కృతి శెట్టి గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. నాగ్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్న హిట్ ఈ సినిమాతో పడటం విశేషం.

More Telugu News