Telangana: నేడు యాదాద్రిలో పర్యటించనున్న కేసీఆర్

  • మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ
  • సుదర్శనయాగం, ఇతర ఏర్పాట్లపై సమీక్ష
  • సుదర్శన యాగంలో 1108 యజ్ఞ గుండాలు
  • యాగంలో 6 వేల మందికిపైగా రుత్విక్కులు
KCR Today visits Yadadri Temple

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్యటించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఈ ఉదయం 11 గంటలకు ఆయన యాదాద్రికి చేరుకుంటారు. ఆలయ పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. మహాకుంభ సంప్రోక్షణకు ముందు వారం రోజులపాటు మహా సుదర్శన యాగం నిర్వహిస్తారు.

ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. సుదర్శన యాగంలో 1108 యజ్ఞ గుండాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గుండానికి ఆరుగురు చొప్పున మొత్తం 6 వేలకు పైగా రుత్విక్కులు ఈ యాగంలో పాలుపంచుకుంటారు. ఆలయ పునఃప్రారంభం సందర్భంగా వేడుకలకు వచ్చే ప్రముఖులు, అతిథులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, పెద్ద ఎత్తున తరలివచ్చే లక్షలాది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపైనా సీఎం కేసీఆర్ సమీక్షిస్తారు. అలాగే, యాగశాల నిర్మాణ పనులు కూడా కేసీఆర్ పరిశీలిస్తారు.

More Telugu News