Womens IPL: మహిళా ఐపీఎల్ కు ప్రాధాన్యం ఇవ్వండి: గంగూలీకి మైఖేల్ వాన్ సూచన

  • క్రికెటర్లు పెరిగినప్పుడే మహిళా ఐపీఎల్ సాధ్యం
  • ఈ ఏడాది మహిళా టీ20 చాలెంజ్
  • సౌరవ్ గంగూలీ ప్రకటన
Womens IPL Should be top priority now Michael Vaughan

మహిళల ఐపీఎల్ నిర్వహించాలంటూ బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. మహిళా క్రికెటర్లు పెరిగినప్పుడే ఐపీఎల్ నిర్వహించడం సాధ్యపడుతుందని స్పష్టం చేశారు.

‘‘మహిళల టీ20 చాలెంజ్ ఈ ఏడాది మే నెలలో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో ఉంటుంది. మహిళా క్రికెటర్లు పెరిగితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మహిళా ఐపీఎల్ నిర్వహించడం సాధ్యపడుతుంది’’ అని గంగూలీ ప్రకటించారు.

భారత మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన, దీప్తి శర్మ తదితరులు సైతం మహిళా ఐపీఎల్ నిర్వహణకు డిమాండ్ చేశారు. మరోవైపు, సౌరవ్ గంగూలీ తాజా వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. ‘‘మహిళా ఐపీఎల్ ను ఎంతో ప్రాధాన్యంగా తీసుకోవాలి సౌరవ్ గంగూలీ’’ అంటూ వాన్ ట్వీట్ చేశాడు.

More Telugu News