Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' కూడా ఈ వేసవిలోనే... రిలీజ్ డేట్ ఇదిగో!

  • వేసవిలో పెద్ద సినిమాల సందడి
  • ఇప్పటికే రిలీజ్ డేట్లు ప్రకటించిన ఆర్ఆర్ఆర్, ఆచార్య
  • అదేబాటలో మహేశ్ బాబు చిత్రం
  • మే 12న వస్తున్న సర్కారు వారి పాట
Sarkaru Vaari Paata release date announced

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ వేసవిలో మే 12న 'సర్కారు వారి పాట' చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజవుతుందని వెల్లడించారు. "వేలం తేదీ ఖరారైంది" అంటూ చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, పెద్ద సినిమాల రిలీజ్, ఇతర అంశాలపై అగ్ర నిర్మాతలు సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్ఆర్ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్ చిత్రాల రిలీజ్ డేట్లు ప్రకటించారు. ఈ బాటలోనే 'సర్కారు వారి పాట' చిత్రం కూడా వేసవి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.

ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ నటించింది. ఈ సినిమా నిర్మాణంలో జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలు పాలుపంచుకున్నాయి.

More Telugu News