Junior NTR: వచ్చే వారంలో సెట్స్ పైకి ఎన్టీఆర్ .. కొరటాల!

  • ఎన్టీఆర్ తో కొరటాల ప్రాజెక్టు
  • ఫిబ్రవరి 7 నుంచి మొదలు
  • స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్
  • రాజకీయాలను టచ్ చేస్తూ సాగే కథ  
Koratala and Ntr Combo Update

ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' భారీ విజయాన్ని సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ నటనలో కొత్త కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరించింది. అలాంటి ఈ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఆలస్యమైంది. వచ్చేనెల 7వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలుకానుందని చెబుతున్నారు. మిక్కిలినేని సుధాకర్ తో కలిసి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో బస్తీకి చెందిన యువకుడిగా .. బస్తీ విద్యార్థుల హక్కుల కోసం పోరాడే స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపిస్తాడట. ఈ విషయంలో అవినీతి రాజకీయాలను .. రాజకీయనాయకులను ఎదుర్కొనే పాత్రను ఎన్టీఆర్ పోషించనున్నాడని అంటున్నారు. త్వరలోనే కథానాయిక విషయంలో క్లారిటీ రానుంది.

More Telugu News