Facebook: ఫేస్ బుక్ మెసెంజర్ లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్

  • చాటింగ్ కు భద్రత
  • ఇతరులు స్క్రీన్ షాట్స్ తీయకుండా నిరోధించే ఫీచర్
  • ఎవరైనా స్క్రీన్ షాట్ కు యత్నిస్తే యూజర్ కు అలర్ట్
New security feature for Facebook Messenger

టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా భద్రత అత్యావశ్యకంగా మారింది. అందుకే సోషల్ మీడియా దిగ్గజాలు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్ డేట్లు తీసుకువస్తుంటాయి. తాజాగా, ఫేస్ బుక్ కూడా తన సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ ఫాం మెసెంజర్ లో కొత్త ఫీచర్ తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ అనుమతి లేకుండా ఇకపై ఎవరూ చాటింగ్ ను స్క్రీన్ షాట్ తీయలేరు.

కొందరు సైబర్ నేరగాళ్లు, వ్యక్తులు చాటింగ్ ను స్క్రీన్ షాట్లు తీసి బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఫేస్ బుక్ తీసుకువస్తున్న తాజా ఫీచర్ ను ఎనేబుల్ చేసుకుంటే, ఇకపై మీరు చేసిన చాట్ ను ఎవరైనా స్క్రీన్ షాట్ తీసేందుకు యత్నిస్తే మిమ్మల్ని అప్రమత్తం చేస్తూ సందేశం వస్తుంది. ఇంతకుముందు, వానిష్ మోడ్ లో చాటింగ్ చేసినప్పుడు ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు సాధారణ చాటింగ్ లకు కూడా ఈ ఫీచర్ ద్వారా రక్షణ కల్పిస్తున్నారు.

More Telugu News