Salaries: ప్రభుత్వ హెచ్చరికల ఫలితం.... ఉద్యోగుల జీతాలను ప్రాసెస్ చేస్తున్న ట్రెజరీ, డీడీవో సిబ్బంది

  • ఏపీలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య వార్
  • పీఆర్సీ జీవోలు రద్దు చేయాలంటున్న ఉద్యోగులు
  • 11వ పీఆర్సీ అమలు చేసి తీరుతామంటున్న సర్కారు
  • ఆదివారం కూడా విధులకు వచ్చిన ట్రెజరీ సిబ్బంది
Treasury and DDO staff processing employees salaries

ఏపీలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి పీఆర్సీ అంశంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే, 11వ పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది. ఉద్యోగుల జీతాలను ప్రాసెస్ చేయాలని, లేనిపక్షంలో తీవ్ర చర్యలు ఉంటాయని ట్రెజరీ, డీడీవో ఉద్యోగులకు నిన్న మరోసారి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ హెచ్చరికల ఫలితంగా ట్రెజరీ ఉద్యోగులు, డీడీవో సిబ్బంది ఉద్యోగుల వేతనాలను ప్రాసెస్ చేస్తున్నారు. ఇవాళ సెలవు అయినప్పటికీ విధులకు హాజరై జనవరి నెల వేతనాలు సిద్ధం చేస్తున్నారు. తొలుత న్యాయమూర్తులు, పోలీస్ సిబ్బంది, పురపాలక శాఖ ఉద్యోగుల వేతనాలను అప్ లోడ్ చేస్తున్నారు.

కాగా, పీఆర్సీపై ప్రభుత్వం ప్రకటించిన జీవోలను వెనక్కి తీసుకోవాల్సిందేనని పట్టుబట్టిన ఉద్యోగులు ఫిబ్రవరి 3న లక్ష మందితో ఛలో విజయవాడకు సిద్ధమవుతున్నారు. ఆపై ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

More Telugu News