Allu Arjun: హిందీ రీమేక్ దిశగా 'దువ్వాడ జగన్నాథం'

  • 2017లో వచ్చిన 'దువ్వాడ జగన్నాథం'
  • బన్నీకి భారీ సక్సెస్ నిచ్చిన సినిమా
  • కథానాయికగా పూజ హెగ్డే
  • స్క్రిప్ట్ లో మార్పులు .. చేర్పులు
Duvvada Jagannatham Hindi Remake

అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోదగిన హిట్ ఇచ్చిన సినిమాలలో 'దువ్వాడ జగన్నాథం' ఒకటిగా కనిపిస్తుంది. 2017లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. అల్లు అర్జున్ జోడీగా పూజ హెగ్డే నటించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు ఒక వార్త బలంగా వినిపిస్తోంది.

తెలుగులో ఈ సినిమాకి దర్శక నిర్మాతలుగా వ్యవహరించిన హరీశ్ శంకర్ - దిల్ రాజు, హిందీ రీమేక్ ను కూడా కలిసే చేయనున్నారట. ఈ సినిమాతోనే హరీశ్ శంకర్ బాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి రంగంలోకి దిగుతున్నారట. ఓ యువ కథానాయకుడు ఇందులో హీరోగా నటిస్తాడని తెలుస్తోంది.

More Telugu News