SBI: ‘మహిళా’ వ్యతిరేక నిబంధనను తొలగించాలంటూ ఎస్బీఐకి మహిళా కమిషన్ నోటీసు

  • మూడు నెలలు నిండితే నో ఎంట్రీ
  • డెలివరీ అయిన నాలుగు నెలల తర్వాతే జాయినింగ్ అంటున్న ఎస్బీఐ 
  • ఇది చట్ట విరుద్ధం, వివక్షా పూరితమన్న మహిళా కమిషన్
Womens Panel Notice To SBI Over Unfit Pregnant Women Guidelines

మూడు నెలలు నిండిన గర్భిణులను సర్వీసులో చేర్చుకోకుండా అడ్డుకుంటున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘‘మూడు నెలలు నిండిన గర్భిణులు సర్వీసులో చేరకుండా నిరోధిస్తూ ఎస్బీఐ 2021 డిసెంబర్ 31న జారీ చేసిన మార్గదర్శకాలు, ‘వారిని తాత్కాలిక అన్ ఫిట్’ అని పేర్కొనడం వివక్ష చూపించడమే. అంతేకాదు, చట్ట విరుద్ధం కూడా. చట్ట ప్రకారం కల్పించిన మెటర్నిటీ ప్రయోజనాలపై ప్రభావం  పడుతుంది. మహిళలకు వ్యతిరేకంగా వున్న ఈ నిబంధనను ఉపసంహరించుకోవాలని కోరుతూ నోటీసు జారీ చేశాం’’ అని స్వాతి వెల్లడించారు.

ఉద్యోగాలకు ఎంపికైన వారిని గర్భంతో ఉన్నారని చేర్చుకోకపోవడం సరికాదన్నారు. తాత్కాలికంగా అన్ ఫిట్ అని చెప్పి.. డెలివరీ అయిన నాలుగు నెలల తర్వాత వారిని చేర్చుకోనున్నట్టు ఎస్బీఐ ఆదేశాలు తెలియజేస్తున్నాయని చెప్పారు. దీన్ని తీవ్రమైన అంశంగా ఆమె పరిగణించారు. అసలు ఈ నిబంధనలను ఎలా రూపొందించారు? దీని వెనుక అధికారులు ఎవరు వున్నారు? తెలియజేయాలని కూడా మహిళా కమిషన్ కోరింది.

More Telugu News