Prabhas: 'సలార్' నుంచి శ్రుతిహాసన్ పోస్టర్ రిలీజ్!

  • 'క్రాక్'తో హిట్ అందుకున్న శ్రుతిహాసన్ 
  • 'ఆద్య' పాత్రలో 'సలార్'లో సందడి
  • పాన్ ఇండియా సినిమా కావడంతో ఆశలు 
  • బాలయ్య .. చిరూ ప్రాజెక్టులలో వినిపిస్తున్న పేరు  
Salaar Sruthi Haasan Poster Released

శ్రుతి హాసన్ కి తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమే. అయితే మధ్యలో ఆమె కెరియర్ కాస్త గాడి తప్పింది. తిరిగి తన కెరియర్ ను గాడిలో పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్న ఆమెకి 'క్రాక్' హిట్ చాలా హెల్ప్ అయింది. ఆ తరువాత ఆమె అంగీకరించిన సినిమానే 'సలార్'.

ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కి ఛాన్స్ దొరకడం నిజంగా ఆమె అదృష్టమే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది గనుక, తన కెరియర్ మరింత పుంజుకుంటుందనే బలమైన నమ్మకంతో ఆమె ఉంది. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి ఉత్సాహాన్ని చూపుతూ వచ్చింది.

ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండనుంది? ఆమె లుక్ ఎలా ఉండనుంది? అనే ఆసక్తి అందరిలోను ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆమె 'ఆద్య' అనే పాత్రలో కనిపించనుందని చెబుతూ, ఆమె లుక్ కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో శ్రుతిహాసన్ కనిపిస్తోంది. ఇక బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలోను .. చిరంజీవి - బాబీ ప్రాజెక్టులోను నాయికగా ఆమె పేరే వినిపిస్తోంది.

More Telugu News