Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు ఆన్ లైన్ లో పంపిన ఏపీ సర్కారు

  • ఆమోదం తెలిపిన మంత్రులు!
  • త్వరలోనే నోటిఫికేషన్
  • ఏపీలో 25 పార్లమెంటు స్థానాలు
  • పార్లమెంటు స్థానాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు
AP Govt speeds up new districts formation process

ఏపీలో 25 పార్లమెంటు స్థానాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చకచకా ముందుకు కదులుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ కు కసరత్తులు చేస్తున్న ప్రభుత్వం... కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు ఆన్ లైన్ లో పంపి వారి ఆమోదం తీసుకుంది.

 ఈ క్రమంలో సీఎస్ సమీర్ శర్మ ఇదే అంశంలో జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించారు. తన ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ రూపొందించిన నివేదికను సమీర్ శర్మ జిల్లాల కలెక్టర్లకు పంపించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గం ఆమోదం కూడా లభించడంతో, అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్కారుకు సన్నాహాలు చేస్తోంది. ఏపీలో 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో, ఏ ప్రాంతం ఏ జిల్లాలో కలుస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

More Telugu News