Andhra Pradesh: ఏపీ పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్థనలు రద్దు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

  • కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
  • పాఠశాలల్లో క్రీడలు నిర్వహించకూడదు
  • పాఠశాల గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుండాలి
No morning prayers in schools in AP

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇకపై ఉదయం పూట ప్రార్థనలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో క్రీడలు నిర్వహించవద్దని తెలిపింది. విద్యార్థులు ఒకే చోట గుమికూడకుండా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని సూచించింది. పాఠశాల గదులను, ఆవరణను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ఆదేశించింది.

జిల్లా విద్యాధికారులు జిల్లా వైద్యాధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండాలని... విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ కరోనా బారిన పడితే వెంటనే చికిత్స అందించేలా చూడాలని తెలిపింది. మాస్కులు ధరిస్తూ, భౌతికదూరాన్ని పాటించాలని చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

More Telugu News