Kangana Ranaut: 'వీరికి ఆవేశం ఎక్కువ'.. అల్లు అర్జున్, య‌శ్‌ల‌ ఫొటోలు పోస్ట్ చేస్తూ, హీరోయిన్ కంగ‌న కామెంట్!

  • సౌతిండియా స్టార్ హీరోల‌పై ప్ర‌శంస‌లు
  • సౌతిండియా స్టార్స్ కు ఆవేశం ఎక్కువని వ్యాఖ్య‌
  • ద‌క్షిణాది కంటెంట్‌లోనూ ఆవేశం ఉటుంది
  • వారు భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయారు
kangana on south stars

సౌతిండియా స్టార్ హీరోల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ బాలీవుడ్ న‌టుల‌పై విమర్శలు చేస్తూ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా సౌతిండియా స్టార్ హీరోలు అల్లు అర్జున్, య‌శ్‌ల ఫొటోల‌ను పోస్ట్ చేసింది. పుష్ప లుక్‌లో బ‌న్నీ, కేజీఎఫ్ సినిమా లుక్‌లో య‌శ్ ఇందులో క‌న‌ప‌డుతున్నారు.
                
సౌతిండియా స్టార్స్ కు ఆవేశం ఎక్కువని, అందుకు కారణాలు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చింది. ద‌క్షిణాది కంటెంట్‌తో పాటు సూపర్ స్టార్స్‌లో అంత ఆవేశం ఉండడానికి వారు భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని చెప్పింది. అలాగే, ఆ స్టార్లు తమ కుటుంబాలను ప్రేమిస్తారు, సంబంధాల విషయంలో పాశ్చాత దేశాల‌ను అనుకరించబోర‌ని పేర్కొంది.

మంచి సంబంధాల‌ను కొన‌సాగిస్తూ వాటిని నిలుపుకుంటారని చెప్పింది. సౌతిండియా స్టార్ల వృత్తి నైపుణ్యం, అభిరుచి అసమానమైన‌వ‌‌ని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. ఇక ఇదే స‌మ‌యంలో బాలీవుడ్ తీరుపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించింది. బాలీవుడ్ త‌మ‌ను భ్రష్టు పట్టించడానికి సౌత్ స్టార్లు అనుమతించబోర‌ని చెప్పింది. కాగా, పుష్ప సినిమా హిందీలోనూ మంచి విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. కేజీఎఫ్ సినిమా కూడా సూప‌ర్ హిట్ అయింది.  

More Telugu News