Andhra Pradesh: జిల్లా కలెక్టర్ స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయి.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు: ఏపీ మంత్రి ఆదిమూలపు

  • ఏపీలో కొనసాగుతున్న పాఠశాలలు
  • కరోనా కేసులు పెరుగుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన
  • అన్ని స్కూళ్లను శానిటైజ్ చేస్తున్నామన్న మంత్రి
Adimulapu Suresh urges students parents not to worry

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. తెలంగాణలో పాఠశాలలకు సెలవులు కొనసాగుతున్నప్పటికీ... ఏపీలో మాత్రం స్కూళ్లను తెరిచారు. ఇంకోవైపు కొన్ని చోట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడటం ఆందోళనను పెంచుతోంది.

ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, పాఠశాలల పరిస్థితిని ప్రతిరోజు జిల్లా కలెక్టర్ స్థాయిలో సమీక్షిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా సోకిన ఉపాధ్యాయులకు వెంటనే సెలవులు ఇస్తున్నామని చెప్పారు. అన్ని స్కూళ్లను శానిటైజ్ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా నిబంధనలను పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలని చెప్పారు.

More Telugu News