Ram: ఫస్టు లుక్ తోనే రామ్ దుమ్మురేపేశాడే!

  • యాక్షన్ ప్రధానంగా రామ్ మూవి  
  • 'ది వారియర్'గా టైటిల్ ఖరారు
  • కథానాయికగా కృతి శెట్టి
  • తెలుగు .. తమిళ భాషల్లో విడుదల
The Worrierr Movie First Look

'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో వచ్చిన మాస్ ఇమేజ్ తో, రామ్ అటు క్లాస్ టచ్ .. ఇటు మాస్ టచ్ ఇస్తూ 'రెడ్' సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో మళ్లీ పూర్తిస్థాయి మాస్ యాక్షన్ కథనే రామ్ ఎంచుకున్నాడు. దర్శకుడు లింగుసామి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రంగంలోకి దిగాడు.

'రెడ్' తరువాత పెద్దగా గ్యాప్ లేకుండా రామ్ ఈ సినిమాను ఎనౌన్స్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి 'ది వారియర్' అనే టైటిల్ ను ఖరారు చేసి, రామ్, ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ గా సీరియస్ లుక్ తో కనిపిస్తూ ఫస్టులుక్ తోనే రామ్ అదరగొట్టేశాడు.

శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'ఉప్పెన' .. 'శ్యామ్ సింగ రాయ్' .. 'బంగార్రాజు'లతో కృతి శెట్టి వరుస హిట్లు కొట్టడం, ఈ సినిమాకి ప్లస్ కానుంది.

More Telugu News