Corona Virus: దేశంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. తాజాగా 2.64 లక్షల కేసుల నమోదు

  • 5,753కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు
  • 12,72,073కు పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
  • హరిద్వార్‌లో గంగానదిలో స్నానాలపై ప్రభుత్వం నిషేధం
India reports over 2 and half lakh fresh Covid cases in last 24 hours

దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,64,202 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఎనిమిది నెలల తర్వాత ఇదే తొలిసారి.

ఇక, ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 5,753కు పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసుల సంఖ్యలో 4.83 శాతం పెరుగుదల కనిపించింది. దేశంలో నమోదైన తాజా కేసులతో కలుపుకుని 12,72,073 కేసులు ఇంకా క్రియాశీలంగా ఉండగా, రోజువారీ పాజిటివ్ రేటు 14.78 శాతానికి పెరిగింది. వారపు పాజిటివిటీ రేటు 11.83 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,09,345 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.

దేశంలో కరోనా వైరస్ మళ్లీ ప్రతాపం చూపిస్తుండడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి రోజున ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లోని గంగానదిలో భక్తుల పుణ్యస్నానాలపై నిషేధం విధించింది.

More Telugu News