Road Accident: వామ్మో ఏంటా స్పీడు.. చావు జస్ట్ మిస్.. ఇదిగో వీడియో!

  • కర్ణాటకలోని ఎలయరపాడులో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
  • బస్సు యూటర్న్ తీసుకుంటుండగా స్కూటర్ పై వేగంగా వచ్చిన యువకుడు
  • సందులో నుంచి దూసుకెళ్లిపోయిన వైనం
Youth Just Missed An Accident

హెల్మెట్ పెట్టుకోలేదు. పైగా ఓవర్ స్పీడ్. మూల మలుపులోనూ వేగం తగ్గలేదు. రయ్...మంటూ దూసుకొచ్చేశాడా యువకుడు. అదే సమయంలో ఓ బస్సు అక్కడ యూటర్న్ తీసుకొంటోంది. యువకుడు వస్తున్న విషయాన్ని గుర్తించిన డ్రైవర్ క్షణాల్లో బ్రేక్ కొట్టేయడం.. ఉన్న కొద్ది గ్యాప్ లో నుంచి బైక్ దూసుకెళ్లిపోవడం కళ్లుమూసి తెరిచేంతలో జరిగిపోయాయి. మృత్యువు నుంచి ఆ యువకుడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఎలయరపాడులో జరిగింది.

అయితే, సదరు యువకుడు బస్సు యాక్సిడెంట్ ను అలా తప్పించుకుని.. ఎదురుగా ఓ చెట్టు, కట్టడం మధ్య నుంచి దూసుకెళ్లిపోయాడు. అక్కడ కూడా అతడు వేగం తగ్గలేదు. బండిమీదున్న హెల్మెట్ కిందపడిపోయినా వెనుదిరిగి చూడకుండా అదే వేగంతో ముందుకెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

More Telugu News