Balakrishna: 'అఖండ' నుంచి 'అడిగా అడిగా' ఫుల్ సాంగ్ ఇదిగో .. చూసేయండి!

  • క్రితం నెల థియేటర్లకు వచ్చిన 'అఖండ'
  • తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వసూళ్లు
  • పండగ బరిలోను పోటీ లేకపోవడం ప్లస్ 
  • ఆ దిశగా ప్రమోషన్స్ చేస్తున్న టీమ్    
Akhanda Adiga Adiga Full Song Released

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కించిన 'అఖండ' సంచలన విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. బాలకృష్ణ కెరియర్లోనే చాలా వేగంగా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా కొత్త రికార్డును సృష్టించింది. అఘోర పాత్ర ద్వారా ఆయన అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా క్రితం నెల 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. సంక్రాంతి బరిలో గట్టి పోటీ లేకపోవడంతో చాలా థియేటర్లలో 'అఖండ'ను అలాగే ఉంచారు. 'సంక్రాంతి సంబరాలు' పేరుతో నిన్న ఈ సినిమా టీమ్ చిన్నపాటి ఈవెంట్ ను కూడా నిర్వహించింది. సంక్రాంతికి జనాలను థియేటర్లకు రప్పించేలా అప్ డేట్స్ వదులుతున్నారు.

అందులో భాగంగానే కొంతసేపటి క్రితం 'అడిగా అడిగా' అనే పూర్తి పాటను వదిలారు. బాలకృష్ణ - ప్రగ్యా జైస్వాల్ పై ఈ పాటను బోయపాటి చాలా బ్యూటిఫుల్ గా .. కలర్ ఫుల్ గా చిత్రీకరించాడు. సంగీత సాహిత్యాల పరంగా ఈ పాట మంచి మార్కులు తెచ్చుకుంది. ఇది ఇప్పుడు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరిస్తోంది. త్వరలో ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకుంటుండటం విశేషం.

More Telugu News