Malappuram: ‘గోళీకాయ’ పరిమాణంలో గుడ్లు పెడుతున్న కోడి.. పచ్చసొన మాయం!

  • కేరళలోని మలప్పురంలో ఘటన
  • ఇటీవలి వరకు మామూలుగానే గుడ్లు
  • ఇప్పటి వరకు 9 గుడ్లు పెట్టిన కోడిపెట్ట
  • చూసేందుకు క్యూకడుతున్న జనం
Eggs in the size of grapes Kerala hen takes internet  viral

అవును! కేరళలోని మలప్పురంలో ఓ కోడి గోళీకాయ పరిమాణంలో గుడ్లు పెడుతూ అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. అది పెడుతున్న గుడ్లలో పచ్చసొన లేకపోవడం మరో విశేషం. మలప్పురంలోని ఏఆర్ నగర్‌కు చెందిన సమద్ పెంచుకుంటున్న కోళ్లలో ఒకటి ఈ గుడ్లు పెడుతోంది.

ఇప్పుడీ కోటిపెట్టకు ఐదేళ్లు. కొన్ని రోజుల క్రితం వరకు మామూలుగానే గుడ్లు పెట్టిన ఈ కోడి ఇప్పుడు మాత్రం ఇలా అతిచిన్న గుడ్లు పెడుతుండడం చూసి విస్తుపోతున్నారు. ఇంట్లోని మిగతా కోళ్లకు పెడుతున్న ఆహారాన్నే దీనికీ పెడుతున్నట్టు చెప్పాడు. అయినప్పటికీ ఇది ఇలా ఇప్పటి వరకు 9 గోళీకాయ గుడ్లు పెట్టిందని సమద్ వాపోయాడు.

ఇక ఆ గుడ్లను పగలగొట్టి చూస్తే లోపల పచ్చసొన లేదని వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అందరూ ఆ గుడ్లు, కోడిపెట్టను చూసేందుకు సమద్ ఇంటికి క్యూ కడుతున్నారు.

More Telugu News