Andhra Pradesh: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను కించపరిచేలా పోస్టుల కేసు.. ఆరుగురికి బెయిల్!

  • సోషల్ మీడియాలో పోస్టులు
  • ఒక్కొక్కరు రూ. 50 వేల చొప్పున పూచీకత్తు సమర్పించాలని ఆదేశం
  • విజయవాడ విడిచి వెళ్లకుండా షరతు
Posts to humiliate AP High Court judges AP High Court Grants Bail to Accused

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పైనా, న్యాయమూర్తులపైనా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నించిన కేసులో ఆరుగురికి బెయిలు మంజూరైంది. నిందితులకు బెయిలు మంజూరు చేసిన హైకోర్టు ఒక్కొక్కరు రూ. 50 వేల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

అలాగే, దిగువ కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు ప్రతి బుధ, శనివారాల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వకుండా విజయవాడ విడిచి వెళ్లొద్దని షరతులు విధించింది.

న్యాయమూర్తులను కించపరిచేలా పోస్టులు పెట్టిన కేసులో బెయిలు మంజూరైన వారిలో అవుతు శ్రీధర్‌రెడ్డి (ఎ7), జలగం వెంకట సత్యనారాయణ (ఏ8), గూడ శ్రీధర్ ‌రెడ్డి (ఏ9), దరిశ కిషోర్‌కుమార్ రెడ్డి (ఏ10), సుస్వరం శ్రీనాథ్ (ఏ12), సుద్దులూరి అజయ్ అమృత్ (ఏ14)లను సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితులు బెయిలు కోసం పెట్టుకున్న దరఖాస్తుపై ఇది వరకే విచారణ పూర్తి కాగా కోర్టు నిన్న బెయిలు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.

More Telugu News