Telangana: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీరందరికీ సెలవుల రద్దు!

  • ప్రభుత్వ  వైద్యులు, నర్సులకు సెలవులు రద్దు
  • థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేలా ప్రభుత్వ ఆసుపత్రులను సిద్ధం చేయాలని ఆదేశం
  • వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసే యోచనలో ప్రభుత్వం
TS govt cancels holidays to doctors and nurses amid raise in corona cases

తెలంగాణలో గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 1,520 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. పైగా ఒమిక్రాన్ కేసులు కూడా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు, నర్సుల సెలవులను రద్దు చేసింది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను సిద్ధం చేయాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించింది.

వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెల 8 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఉన్న నేపథ్యంలో... 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న విద్యార్థులకు స్కూళ్లలోనే వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

More Telugu News