Corona Virus: ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేయించండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన

  • దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • 20 వేలు దాటిన రోజువారీ కేసులు
  • ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
Centers suggestion to states amid raise in Corona cases

ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజు వారీ కేసులు 20 వేలను దాటేశాయి. డెల్టా వేరియంట్ కు తోడు ఒమిక్రాన్ వేరియంట్ కూడా పంజా విసురుతోంది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల తీవ్రత బీభత్సంగా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన, రుచి కోల్పోవడం, అలసట, విరేచనాలతో బాధపడుతుంటే కనుక వారికి కరోనా సోకినట్టు భావించాలని... వారికి వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించాలని సూచించింది. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు కూడా సూచించింది. ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది.

More Telugu News