Sudheer Babu: ఇది కృతిశెట్టి ప్రీ లుక్ .. రేపు ఫస్టులుక్!

  • 'ఉప్పెన'తో హిట్ కొట్టిన కృతిశెట్టి
  • 'శ్యామ్ సింగ రాయ్'తో మంచి పేరు
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'బంగార్రాజు'
  • లైన్లో మరో మూడు సినిమాలు  
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Update

2021లో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన అందాల కథానాయిక ఎవరైనా ఉన్నారా? అంటే అంది కృతిశెట్టినే. ఆమెను బీట్ చేస్తూ ఇంతవరకూ అయితే ఎవరూ రాలేదు. తొలి సినిమా 'ఉప్పెన'తోనే భారీ హిట్ కొట్టేసిన ఈ బ్యూటీ, రీసెంట్ గా వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' తోను మంచి మార్కులు కొట్టేసింది.

ఇక వచ్చే ఏడాది ఈ సుందరి నుంచి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా రానుంది. మైత్రీ - బెంచ్ మార్క్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆమె సుధీర్ బాబు జోడీగా కనిపించనుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి, కొంత సేపటి క్రితం ప్రీ లుక్ తరహాలో ఒక స్టిల్ వదిలారు. ఫస్టులుక్ ను రేపు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

ఇక ఈ సినిమాతో పాటు కృతిశెట్టి చైతూ జోడీగా 'బంగార్రాజు'లో నటించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఇక నితిన్ సరసన 'మాచర్ల నియోజక వర్గం' చేస్తున్న కృతి, రామ్ జోడీగా కూడా ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాలన్నీ కూడా 2022లో వరుసగా రానుండటం విశేషం..

More Telugu News