train: రైలు వ‌స్తుండ‌గా ప‌ట్టాల‌పై ప‌డుకున్న యువ‌కుడు.. రైలు ఆపేసిన లోకో పైల‌ట్‌.. వీడియో ఇదిగో

  • ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌కుడు
  • కుటుంబ సభ్యులకు అప్పగించిన రైల్వే పోలీసులు
  • ముంబైలోని ఓ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ఘ‌ట‌న‌
youngster attempts suicide

ఓ రైలు వ‌స్తుండ‌గా ప‌ట్టాల‌పై ప‌డుకుని ఆత్మ‌హ‌త్యాయత్నం చేశాడు ఓ యువ‌కుడు. అయితే, ఆ విష‌యాన్ని గుర్తించిన లోకో పైల‌ట్ రైలుని ఆప‌డంతో ఆ యువ‌కుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. వెంట‌నే అత‌డిని రైల్వే పోలీసులు అక్క‌డి నుంచి తీసుకువెళ్లారు.

ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని ఓ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద చోటు చేసుకుంది. ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు రైలు ప‌ట్టాల‌పైకి వ‌చ్చిన ఓ యువ‌కుడు స‌రిగ్గా రైలు వ‌స్తోన్న స‌మ‌యంలో ప‌ట్టాల‌పై త‌ల‌పెట్టి ప‌డుకున్న ఈ దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్త‌మ‌య్యాయి. ఆ యువ‌కుడికి న‌చ్చ‌జెప్పిన పోలీసులు అత‌డిని కుటుంబ స‌భ్యులకు అప్ప‌గించారు.

More Telugu News