BJP: దుమారం రేపుతున్న ‘చీప్ లిక్కర్’ వ్యాఖ్యలపై సోము వీర్రాజు వివరణ

  • తమకు అధికారం ఇస్తే రూ. 50కే చీప్ లిక్కర్ ఇస్తామన్న సోము వీర్రాజు
  • పేదల కష్టాన్ని జగన్ ప్రభుత్వం దోచుకుంటున్నందుకే అలా అన్నానని వివరణ
  •  తనపై విమర్శలు చేసిన వారిపై ఘాటు వ్యాఖ్యలు
AP BJP chief somu veerraju responded about his cheap liquor comments

తమకు అధికారం ఇస్తే 50 రూపాయలకే నాణ్యమైన క్వార్టర్ లిక్కరు ఇస్తామని వ్యాఖ్యానించి విమర్శల పాలైన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. పేదల కష్టాన్ని జగన్ ప్రభుత్వం దోచుకుంటోందని, అందుకనే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. మద్యం కోసం పేదలు రోజూ రూ. 250 వరకు ఖర్చు చేస్తున్నారని, ఆ ఖర్చులో రూ.200 తగ్గితే ఆ కుటుంబంపై భారం తగ్గుతుందని, ప్రతి నెలా రూ. 6 వేలు ఆదా అవుతాయని అన్నారు.

ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై విరుచుకుపడిన వారిపై వీర్రాజు మండిపడ్డారు. స్పీకర్ తమ్మినేనికి రాత్రుళ్లు ఎక్కువై ఉదయం నోరు మడతపడుతుందని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణను మొబైల్ పొలిటీషియన్‌గా అభివర్ణించారు. మంత్రి కొడాలి నాని చేతికి దారాలు తప్ప తలలో మెదడు లేదని అన్నారు. లీజుల గురించి మాట్లాడితే వైసీపీ నేతల చొక్కాలు ఊడతాయన్న విషయాన్ని మంత్రి పేర్ని నాని తెలుసుకోవాలని చురకలు అంటించారు. తమను జగన్ పార్టీ అంటున్న పయ్యావుల నిజం తెలుసుకోవాలని సోము వీర్రాజు సూచించారు.

More Telugu News