SS Thaman: సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరే ఉండాలి.. అక్కడ అలా లేదు కాబట్టే బాలీవుడ్ నుంచి వచ్చేశా: తమన్

  • ఒక్క సినిమాకు ఐదారుగురు పనిచేస్తారు
  • వాళ్లలో ఒకడినైపోతానేమోనని భయపడ్డా
  • పాటలకొకరు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు మరో మ్యూజిక్ డైరెక్టరా?
  • అలాగైతే పెళ్లి ఒకరితో.. ఫస్ట్ నైట్ మరొకరితో అన్నట్టవుతుంది
Thaman Sensational Comments On Bollywood

బాలీవుడ్ పై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో పరిస్థితుల గురించి వివరించాడు. బాలీవుడ్ లో ఒక్క సినిమాకు ఐదారుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తుంటారని, అది తనకు అస్సలు నచ్చదని చెప్పుకొచ్చాడు. ఒక సినిమాకు అంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. అక్కడే ఉంటే వాళ్లలో ఒకడ్ని అయిపోతానేమోనని భయపడి అక్కడి నుంచి వచ్చేశానన్నాడు. అక్కడ తాను ఇమడలేకపోయానన్నాడు.

ఒక సినిమా అంటే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలని, అప్పుడే మంచి సంగీతం అందించగలుగుతామని తెలిపాడు. పాటలకో సంగీత దర్శకుడు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు మరో మ్యూజిక్ డైరెక్టర్ అంటే.. పెళ్లి ఒకరితో, ఫస్ట్ నైట్ మరొకరితో అన్నట్టు పరిస్థితి తయారవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తెలుగులో తమన్ ఫుల్ బిజీ అయిపోయాడు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 10 సినిమాల దాకా తమన్ చేతిలో ఉన్నాయి. కాగా, హిందీలో ‘గోల్మాల్’, ‘సూర్యవన్శ్’ ‘సింబా’ వంటి సినిమాలకు సంగీతం అందించాడు.

More Telugu News