Karnataka: పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్.. వ‌చ్చేనెల 3 నుంచి స్కూళ్ల‌లో టీకాలు: క‌ర్ణాట‌క సీఎం బొమ్మై

  • ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాం
  • అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ వృద్ధుల‌కు కూడా వేస్తాం
  • జ‌న‌వ‌రి 10 నుంచి అద‌న‌పు డోసు  
Karnataka CM Basavaraj Bommai on vaccination drive

దేశంలో పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వయసు ఉన్న‌ వారికి జనవరి 3 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తామని ప్రధాని మోదీ ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న చేశారు. అలాగే జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులకు వైద్యుల‌ సలహా మేరకు ప్రికాషనరీ డోసు (మూడో డోసు) పంపిణీ చేస్తామని చెప్పారు.

దీంతో ప‌లు రాష్ట్రాలు ఇందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీనిపై ఈ రోజు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ... జ‌న‌వ‌రి 3 నుంచి రాష్ట్రంలోని స్కూళ్ల‌లో వ్యాక్సినేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించి వ్యాక్సిన్లు వేయనున్న‌ట్లు చెప్పారు. అలాగే, అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ వృద్ధుల‌కు జ‌న‌వ‌రి 10 నుంచి అద‌న‌పు డోసు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు సూచించామ‌ని ఆయ‌న వివ‌రించారు.

More Telugu News