Allu Arjun: ఇక్కడే కాదు .. నార్త్ లో కూడా దూకుడు మీదున్న 'పుష్ప'!

  • ఈ నెల 17న వచ్చిన 'పుష్ప'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  • హిందీలోను తగ్గని జోరు
  • తొలివారంలో 229 కోట్ల గ్రాస్  
Pushpa movie update

అల్లు అర్జున్ తన కెరియర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి, పాత్రను బట్టి తన లుక్ ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. ఆయన సినిమా పోస్టర్లు చూసి అది ఏ సినిమానో చెప్పేయవచ్చు. అంతగా ఆయన ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ఉత్సాహాన్ని చూపుతుంటాడు. అలాగే ఈ సారి కూడా ఆయన 'పుష్ప' రాజ్ కోసం పూర్తిగా మారిపోయాడు. ఆయన లుక్ తోనే ఈ సినిమా పై హైప్ మొదలైంది.

ఇక సుకుమార్ కాంబినేషన్లో ఆల్రెడీ హిట్స్ ఉండటం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమైంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్ కాంబినేషన్ మరో కారణమనే చెప్పాలి. మొత్తానికైతే ఏ రోజుకు ఆ రోజు ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వెళ్లారు .. తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 229 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేశారు.   

ఈ సినిమాకి తొలి రోజునే మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఆ టాక్ ఆ తరువాత షోస్ పై ఎలాంటి ప్రభావం చూపించలేక పోయింది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతోంది. ఇక నార్త్ లోను 'తగ్గేదే లే' అన్నట్టుగానే ముందుకు వెళుతోంది. ఇప్పటికీ కూడా ఈ సినిమా అక్కడ రోజుకు 3 కోట్లకి పైగా వసూలు చేస్తుండటం విశేషమని చెప్పుకుంటున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' వరకూ మధ్యలో పెద్ద సినిమాలేవీ వచ్చే అవకాశాలు లేకపోవడం, ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అంశం.

More Telugu News