Puri Jagannadh: పూరి తన తొలిచిత్రాన్ని కృష్ణతో చేయవలసిందట!

  • పూరిలో ఆ ఫైర్ ఉండేది
  • తానే ఛాన్స్ ఇప్పించానన్న రచయిత సత్యదేవ్ 
  • ఆ సినిమా మొదట్లోనే ఆగిపోయింది
  • ఆయనను ఎప్పుడూ సాయం అడగలేదన్న సత్యదేవ్
Writter Sathyadev said about Puri Jagannath

పూరి జగన్నాథ్ తెలుగు తెరకి 'బద్రి' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. పవన్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలో 'బద్రి' ఒకటిగా కనిపిస్తుంది. అలాగే ఆ తరువాత పూరి ఎన్ని సినిమాలు చేసినా 'బద్రీ' స్థానం 'బద్రీ'దే. అయితే ఈ సినిమా కంటే ముందు పూరి .. కృష్ణతో ఒక సినిమా చేయవలసిందని 'శ్యామ్ సింగ రాయ్' రచయిత సత్యదేవ్ అన్నారు.

తాజా ఇంటార్వ్యులో ఆయన మాట్లాడుతూ .. "పూరిలో మొదటి నుంచి కూడా మంచి ఫైర్ ఉండేది. అది గమనించిన నేను ఒక నిర్మాతను పట్టుకుని దర్శకుడిగా పూరికి ఛాన్స్ ఇప్పించాను. ఆ సినిమా పేరు 'థిల్లానా' .. హీరో కృష్ణగారు. అయితే  సినిమా మొదలైనట్టే మొదలై కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఆ తరువాత పూరి చేతికి 'బద్రి' సినిమా వచ్చింది.

ఆ సినిమా నుంచి దర్శకుడిగా ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. చూస్తుండగానే ఆయన స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయారు. ఇప్పటికీ నేను ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు. ఈ రోజున ఆయనే నాకు సాయం చేసే స్థాయికి ఎదిగారు. అయినా నేను ఎప్పుడూ ఆయన దగ్గరికి ఏ సాయం కోసం వెళ్లలేదు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News