Allu Arjun: రేపు కాకినాడలో 'పుష్ప' సక్సెస్ పార్టీ!

  • ప్రాంతాలవారీగా సక్సెస్ పార్టీ నిర్వహణ 
  • తిరుపతిలో జరిగిన తొలి సక్సెస్ పార్టీ  
  • నిన్న చెన్నైలో సందడి చేసిన 'పుష్ప' టీమ్
  • హిందీలోను తగ్గని జోరు    
Pushpa movie update

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' ఈ నెల 17వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. తొలి రోజున మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతోంది. ఏ రోజుకు ఆ రోజు కొత్త నెంబర్స్ ను నమోదు చేస్తోంది. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ పార్టీలను ప్రాంతాలవారీగా నిర్వహిస్తూ వస్తున్నారు.

తొలి సక్సెస్ మీట్ ను మొన్న తిరుపతిలో నిర్వహించారు. నిన్న ఈ సినిమా సక్సెస్ పార్టీని చెన్నైలో జరిపారు. ఇక రేపు సక్సెస్ పార్టీని కాకినాడలో నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. సక్సెస్ పార్టీలు ఈ సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చాయనే అంటున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతున్నట్టుగా చెబుతున్నారు. అనువాద చిత్రాల ద్వారా ఉత్తరాదివారికి అల్లు అర్జున్ బాగానే తెలుసు. ఆయన సినిమాలను అక్కడి వారు బాగానే ఇష్టపడుతూ ఉంటారు. ఈ సినిమా అక్కడ ఆ స్థాయిలో దూసుకుపోవడానికి అదే కారణమని చెప్పుకుంటున్నారు..

More Telugu News