Women: పారా సెయిలింగ్ వికటించి 100 మీటర్ల ఎత్తునుంచి పడిపోయిన మహిళలు... వీడియో ఇదిగో!

  • ముంబయి అలీబాగ్ బీచ్ లో పారా సెయిలింగ్
  • ఒకే పారాచూట్ తో గాల్లోకి లేచిన మహిళలు
  • బోటుకు కట్టిన తాడు ఊడిపోయిన వైనం
  • లైఫ్ జాకెట్లు ఉండడంతో తప్పిన ప్రమాదం
Two women falls into sea while parasailing

ముంబయి సముద్ర తీరంలో పారా సెయిలింగ్ సాహసం చేయాలని భావించిన ఇద్దరు మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. ముంబయిలోని సకినాకా ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు పారా సెయిలింగ్ కోసం అలీబాగ్ బీచ్ కు వచ్చారు. ముందు ఓ బోటు వెళుతుండగా, దానికి అనుసంధానించిన పారాచూట్ ద్వారా గాల్లో ఎగరాలని వారు భావించారు.

అయితే, బోట్ బయల్దేరగా, ఆ మహిళలు ఇద్దరూ పారాచూట్ సాయంతో గాల్లోకి లేచారు. కానీ పారాచూట్ తాడు ఊడిపోవడంతో ఆ మహిళలు ఇద్దరూ 100 మీటర్ల ఎత్తు నుంచి సముద్రంలో పడిపోయారు. వారికి లైఫ్ జాకెట్లు ఉండడంతో ప్రమాదం తప్పింది. సహాయక బృందాలు వచ్చేవరకు వాళ్లు నీటిపై తేలుతూనే ఉన్నారు. కాగా, బోట్ ఆపరేటర్ నిర్లక్ష్యం వల్లే తాడు ఊడిపోయినట్టు భావిస్తున్నారు. ఈ ఘటన కొన్ని రోజుల కిందట జరగ్గా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News