Allu Arjun: అలా జరక్కపోతే నేను హర్ట్ అవుతాను: రష్మిక

  • ఈ నెల 17న వచ్చిన 'పుష్ప'
  • భారీ వసూళ్లతో కొత్త రికార్డు
  • తిరుపతిలో జరిగిన సక్సెస్ మీట్
  • బన్నీకి అవార్డ్స్ రావలసిందేనన్న రష్మిక  
Pushpa Success Meet

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రష్మిక చక్రం తిప్పేస్తోంది. వరుస విజయాలతో ఆమె దూసుకుపోతోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పుష్ప' .. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న తిరుపతిలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రను పోషించిన రష్మిక, ఈ వేదికపై తనదైన శైలిలో మాట్లాడింది.

"అల్లు అర్జున్ సార్ .. నేను మీకు ఫ్యాన్ ని కాదు .. అంతకుమించి. ఈ సినిమాలో మీరు ఎంతో అద్భుతంగా నటించారు. స్క్రీన్ పై మీ ఎనర్జీ చూస్తుంటే మాటలు రావడం లేదు. కచ్చితంగా ఈ ఏడాది నేషనల్ అవార్డుతో పాటు అన్ని అవార్డులు మీకు రావాలనే కోరుకుంటున్నాను. అలా రాకపోతే మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను.

సుకుమార్ గారి డైరెక్షన్ సూపర్ .. చింపేశారు. ఇక దేవిశ్రీ గారి పాటలు ఈ సినిమాకి హైలైట్. ప్రతి పాట అదిరిపోయింది. ఆయన పాటల వలన మాకు దిష్టి తగులుతుందేమోనని అనిపిస్తోంది. అందుకే నేను దిష్టి తీసుకుంటున్నాను. ఇక ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి మైత్రీ మూవీస్ వారు కారకులు. వాళ్లకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను" అంటూ ముగించింది.

More Telugu News