Revanth Reddy: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖాస్త్రం

  • ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
  • 51 శాతం మంది ఫెయిల్
  • పలువురు విద్యార్థుల బలవన్మరణం
  • ప్రభుత్వంపై ధ్వజమెత్తిన రేవంత్
  • తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోలేదని విమర్శలు
Revanth Reddy wrote CM KCR over Inter First Year Results

తెలంగాణలో మరోసారి పరీక్ష ఫలితాల కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల కాగా, అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయంటూ ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖాస్త్రం సంధించారు.

2019లో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని, అందుకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గతంలో చేసిన తప్పిదాల నుంచి ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదన్న విషయం తాజా ఫలితాలతో నిరూపితమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ అలసత్వం కారణంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నెలకొందని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది ఫెయిలవడం తెలిసిందే. దాంతో పలువురు విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

More Telugu News