RRR: ముంబైలో 'ఆర్ఆర్ఆర్' బృందం.. ఇద్ద‌రు హీరోల ఫొటోలు వైర‌ల్

  • ముంబై చేరుకున్న చిత్ర బృందం
  • ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వేదిక సిద్ధం
  • భారీగా ఏర్పాట్లు
rrr team in mumbai

జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి యంగ్ హీరోలు న‌టిస్తోన్న‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న నేప‌థ్యంలో ఆ చిత్ర బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. నేడు ముంబైలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వ‌హిస్తోంది. ముంబైలో భారీగా ఏర్పాట్లు చేశారు. బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్ ఈ ఈవెంట్‌కు వ‌స్తార‌ని తెలుస్తోంది.

ముంబైలోని ఫిల్మ్ సిటీలో 'ఆర్ఆర్ఆర్' వేడుక‌కు సిద్ధ‌మైన వేదిక, అక్క‌డ‌ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ దిగిన‌ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. అలాగే, ముంబై విమానాశ్ర‌యంలో ఆ ఇద్ద‌రు హీరోలు దిగిన ఫొటోలు కూడా సామాజిక మాధ్య‌మాల్లో చక్క‌ర్లు కొడుతున్నాయి.
                        
ఈ సినిమా కోసం నిర్మాత డీవీవీ దానయ్య భారీగా ఖర్చుపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో అలియా భట్, అజయ్ దేవగన్ కూడా పాల్గొననున్నారు. బాహుబ‌లి వంటి భారీ హిట్ అనంత‌రం రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. సంక్రాంతి ముందు విడుద‌ల కానున్న ఈ సినిమా ఏ స్థాయిలో వ‌సూళ్లు రాబ‌డుతుంద‌న్న ఆస‌క్తి నెల‌కొంది.

ఈ సినిమాలో కొమురం భీంగా జూనియ‌ర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. దేశంలోని ప‌లు భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్న నేప‌థ్యంలో ఆయా భాష‌ల న‌టీన‌టులు కూడా ఈ సినిమాలో ఉండేలా చిత్ర బృందం చూసుకుంది. ఇప్ప‌టికే ప‌లు ప్రెస్‌మీట్లు నిర్వ‌హించి ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంది. నేడు జ‌ర‌గ‌నున్న ఈవెంట్ కోసం కూడా ఆ చిత్ర బృందం భారీగా ఖ‌ర్చు చేసింది.  

             
            

More Telugu News