KTR: ఆ జూనియర్ మంత్రికి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవు: కేటీఆర్

  • ఆర్మీ పరిధిలో కంటోన్మెంట్ ఏరియా
  • కంటోన్మెంట్ పరిస్థితిపై కేటీఆర్ ట్వీట్
  • రోడ్లను ఇష్టానుసారం మూసివేస్తున్నారని ఆరోపణ
  • కేంద్రం ఎందుకు అడ్డుకోవడంలేదన్న కేటీఆర్
  • కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో కలిపేయాలని విజ్ఞప్తి
KTR tweets on Cantonment area

ఆర్మీ కార్యకలాపాలు ఎక్కువగా జరిగే కంటోన్మెంట్ ఏరియాలో రోడ్లు మూసివేతపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కంటోన్మెంట్ లో 21 రోడ్లను మూసివేశారని, కేంద్ర ప్రభుత్వం మాత్రం 2 రోడ్లనే మూసివేసినట్టు చెబుతోందని ఆరోపించారు.

మీ జూనియర్ మంత్రి (కిషన్ రెడ్డి)కి కంటోన్మెంట్ లో ఉండే క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవు అంటూ రాజ్ నాథ్ కు తెలిపారు. కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వెల్లడించారు. ఈ చర్యలను కేంద్రం ఎందుకు అడ్డుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కంటోన్మెంట్ బోర్డు తగు చర్యలు తీసుకోలేకపోతే, కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని సూచించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

More Telugu News