Nani: హైదరాబాద్ లో 'శ్యామ్ సింగ రాయ్' ఈవెంట్!

  • కలకత్తా నేపథ్యంలో సాగే కథ 
  • నాని ద్విపాత్రాభినయం
  • బెంగాలీ యువతిగా సాయిపల్లవి
  • రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 24వ తేదీన విడుదల
Shyam Singha Roy movie update

నాని - రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందింది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

రీసెంట్ గా రాయల్ ఈవెంట్ పేరుతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ లో జరిపారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో ప్లాన్ చేశారు. రేపు సాయంత్రం శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.

ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఒక పాత్ర సరసన సాయిపల్లవి, మరో పాత్ర జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాపై నాని గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

More Telugu News