Pushpa: 'త‌గ్గేదే లే' అంటూ 'పుష్ప' ఆడుతోన్న థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ హంగామా.. వీడియోలు ఇవిగో

  • ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన 'పుష్ప'
  • సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న
  • డ్యాన్సుల‌తో హోరెత్తిస్తోన్న ఫ్యాన్స్‌
fans dance in pushpa theatres

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన పుష్ప సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ రోజు విడుద‌ల కావ‌డంతో థియేట‌ర్ల వ‌ద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు.

                ఓ థియేట‌ర్ వ‌ద్ద స్క్రీన్ వ‌ద్ద‌కు వెళ్లి పేప‌ర్లు ఎగ‌రేస్తూ డ్యాన్సుల‌తో అభిమానులు హోరెత్తించారు.                       
                  
'పుష్ప' విడుద‌లైన అన్ని థియేట‌ర్ల వ‌ద్ద అల్లు అర్జున్ భారీ క‌టౌట్లు క‌న‌ప‌డుతున్నాయి. థియేట‌ర్ల ముందు ఫ్యాన్స్ డ్యాన్సులు చేస్తూ హోరెత్తిస్తున్నారు. త‌గ్గేదే లే అనే డైలాగుతో నినాదాలు చేస్తూ ర‌చ్చ చేస్తున్నారు.
                    
'పుష్ప: ది రైజ్' పేరుతో విడుద‌లైన ఈ సినిమాలో అల్లు అర్జున్‌, రష్మికతో పాటు ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, ధనుంజయ, అనసూయ, రావు రమేశ్‌, అజయ్ తదితరులు న‌టించారు. ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఈ సినిమా పాట‌లు బాగా అల‌రించిన విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.              

              సినిమా చూడ‌డానికి హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్ సంధ్య థియేట‌ర్ కు బ‌న్నీ వ‌చ్చాడు.

More Telugu News